ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ రైలు CR450ని చైనా ఆవిష్కరించింది. ఈ రైలు గంటకు 450 కి.మీల వేగంతో ప్రయాణించగలదు. ఈ రైలుకు సంబంధించిన ఓ వీడియోను చైనా మీడియా విడుదల చేసింది. ఇందులో క్యాబిన్ సౌండ్ తగ్గడంతో పాటు బిజినెస్ క్లాస్ సీట్లు 300 డిగ్రీస్ తిరుగుతాయి. వినూత్నమైన డ్రాగ్ రెడ్యూసింగ్ డిజైన్‌తో రైలు బరువును 10 శాతం తగ్గించారు. ఈ రైలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.