ఏపీ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

50చూసినవారు
ఏపీ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీమ్ అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఆరోపించారు. వాళ్లకు ఇష్టం వచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చారని విమర్శించారు. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని.. సీనియర్లను స్క్రాప్ కింద జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల్లో షర్మిల టీమ్ ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం తగ్గిందని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్