రహదారుల అభివృద్ధికి ఆర్ అండ్ బి సహకరించాలి: ఎమ్మెల్యే

51చూసినవారు
రహదారుల అభివృద్ధికి ఆర్ అండ్ బి సహకరించాలి: ఎమ్మెల్యే
అనపర్తి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఆర్అండ్ బి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డిని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. సోమవారం ఆయన విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయంలో శ్రీనివాసరెడ్డిని కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాల్సిన రహదారుల వివరాలను తెలియజేశారు. కాకినాడ పోర్ట్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఏడిబి రోడ్ ను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్