అనపర్తి సామాన్య కార్యకర్తలకు సైతం ఎమ్ ఎల్ ఏ సీటు ఇవ్వడం అనేది బీజేపీ పార్టీ వల్లే సాధ్యం అని మరొకసారి నిదర్శనం అయ్యింది. నిన్న ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల లిస్టులో బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన శివ రామ కృష్ణంరాజును ప్రకటించారు. శివ రామ కృష్ణంరాజు ఆర్మీలో దేశ సేవ చేశారు. తనపై నమ్మకంతో అనపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన కేంద్ర పెద్దలకు, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరికి, జాతీయ కమిటీ సభ్యులు సోము వీర్రాజుకి శివ రామ కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు.