శివరామకృష్ణం రాజు కు మద్దతు తెలిపిన టిడిపి నేత నళినీకాంత్

1055చూసినవారు
అనపర్తి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శివరామకృష్ణంరాజుకు తెలుగుదేశం సీనియర్ నేత పెండ్యాల నళినీకాంత్ గురువారం మద్దతు తెలిపారు. రంగంపేట మండలానికి చెందిన పెండ్యాల నలినీకాంత్ కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో మాత్రమే విభేదాలు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీలో తాను కొనసాగుతున్నట్లు తెలిపారు. బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణం రాజు గెలుపునకు కృషి చేస్తామని నలిని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్