కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో మంగళవారం అనగా 3వ తారీకు వస్తున్న పెన్షన్లు ఇవ్వలేదు. 1వ తారీకున ఇచ్చే ఫెన్షన్లు ఎందుకు ఇవ్వలేదు అని ఆరా తీయగా టీడీపీ ప్రభుత్వం ఆపేసింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విధమైన నీచ రాజకీయాలు సరికాదని తక్షణమే వికలాంగులకు, వయోవృద్ధులకు ఎప్పటిలాగే ఇంటి వద్దకే ఫెన్షన్లు అందించాలని కిర్లంపూడి మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్ డిమాండ్ చేశారు.