కాట్రావులపల్లిలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట సీఐ ఎస్. లక్ష్మణరావుకు వచ్చిన సమాచారం మేరకు గురువారం జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 42వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రఘునాధరావు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.