కాకినాడ: విద్యారంగాన్ని నిర్వీర్యంచేసే జీవో 117ను రద్దు చేయాలి
విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే జీవో 117ను రద్దు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి. మనోజ్ కుమార్, సి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ఎన్జీవో హోం లో బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బహుజన టీచర్స్ అసోసియేషన్ సంఘాలను 26 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.