మూర్ఛవ్యాధికి కాకినాడ జిజిహెచ్ లో ప్రత్యేక ఓపి సేవలు ప్రారంభించడం జరిగిందని సూపరింటెండెంట్ డా. లావణ్య కుమారి వెల్లడించారు. ఆదివారం ప్రత్యేక ఓపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇకపై ప్రతి శనివారం 3వ నెంబరు ఓపి నందు పరీక్ష చేయించుకుని ఉచితంగా మందులు పొందవచ్చునని తెలిపారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా. విఠల్, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎసెస్. శశి, మాజీ వీసీ డా. బాబ్జి పాల్గొన్నారు.