కాట్రేనికోనలో ఈ కేవైసీ కోసం ఎగబడుతున్న జనం
ఉచిత గ్యాస్ పథకం అమలుకానున్న నేపథ్యంలో కాట్రేనికోనలోని గ్యాస్ కంపెనీల వద్ద శనివారం ఈ కేవైసీ కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు. వారిని సిబ్బంది అదుపు చేయలేకపోవడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కంపెనీ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తోపులాటను తగ్గించారు.