ఐ. పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు అగ్రికల్చరల్ ఒకేషనల్ ఫీల్డ్ లో బాగంగా అంబాజీపేట డాక్టర్ వై. ఎస్. ఆర్. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కొబ్బరి, కోకో, తదితర పంటలపై చేపడుతున్న పరిశోధనలపై విద్యార్థులకు కేంద్రీయ శాస్త్రవేత్తలు గోవర్ధన్ రావు, అనూష పలు విషయాలపై అవగాహన కల్పించారు. పంటలకు వచ్చే తెగుళ్ల గురించి, వాటి నివారణ పద్ధతులు వివరించారు.