ముమ్మిడివరం: పెన్షన్ తొలగించారని బాధితుని ఆవేదన

56చూసినవారు
ముమ్మిడివరం మండలం ఠాణేలంక బాడవ గ్రామానికి చెందిన దొమ్మేటి వెంకటేశ్వరరావు తన పెన్షన్ తొలగించడంతో శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 25 సంవత్సరాల నుంచి వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రూ. 6 వేలు పెన్షన్ తీసుకున్నానని, కూటమి ప్రభుత్వంలో రెండు నెలలు రూ. 15 వేలు పెన్షన్ అందజేశారని తెలిపారు. గత రెండు నెలల నుంచి పెన్షన్ తొలగించారని లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్