ముమ్మిడివరంలో విచిత్ర వాతావరణం.. ఎండలో వాన

76చూసినవారు
ముమ్మిడివరం మండలంలో శనివారం ఒకపక్క ఎండకాస్తూనే మరోపక్క వర్షం కురిసి భిన్న వాతావరణం నెలకొంది. విపరీతమైన ఎండకాస్తూనే భారీ వర్షం కురిసింది. ఈ వింత వాతావరణాన్ని ప్రకృతి ప్రేమికులు ఆస్వాదించారు. అరుదుగా జరిగే ఈ ఘటనకు పలువురు ఆనందం వ్యక్తం చేశారు. కాగా భారీ వర్షానికి రహదారులపై గుంతలలో నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్