మామిడికుదురు: వరిని పీడిస్తున్న బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు
చిరు పొట్ట దశలో వరి పంటను బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వేధిస్తోంది. మామిడికుదురు మండల పరిధిలో ఈ తెగులు ప్రభావం ఎక్కువగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 2569 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు. ప్రధానంగా సాగు చేసిన ఎంటీయూ-1318 రకం వరి పంటపై తెగులు తీవ్ర ప్రభావం చూపిందని ఏవో మృధుల గురువారం తెలిపారు. దీని నివారణకు నత్రజని తగ్గించి పొటాష్ ఎరువులు వాడాలని, నీటిని తగ్గించాలన్నారు.