నిడదవోలు పట్టణంలోని చర్చిపేటలో ఉన్న కోడ్ నెంబర్ 118, 119, 120 అంగన్వాడీ కేంద్రాల తలుపులను బద్దలు కొట్టి సామగ్రి ధ్వంసం చేశారు. శుక్రవారం సాయంత్రం అంగన్వాడీ సెంటర్లను కార్యకర్తలు మూసివేసి ఇంటికి వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం సెంటర్లకు వచ్చేసరికి తాళాలు బద్దలు కొట్టి తలుపులు తెరిచి వస్తువులన్నీ చిందర పందరగా పడి ఉన్నాయి.