ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉందని జేడీ విజయ్ కుమార్ అన్నారు. పెద్దాపురం వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయశాఖాధికారులు ఏడీఏ దైవ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత తుఫాన్ వాతావరణ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా సూచనలిచ్చి రైతులకు అందుబాటులో ఉండి వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.