పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రావణమాసం శుక్రవారం జరిగిన వరలక్ష్మి వ్రత పూజలకు రమ్మని తనను ఎవ్వరు పిలవలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక టిక్కెట్ ఇవ్వలేదని తెలిపారు. తొలిసారి శ్రావణ శుక్రవారం పూజల్లో తాను, తన సతీమణి పాల్గొనలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణమాసం ఆఖరిరోజు సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.