వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. విజయవాడ వరద బాధితులు కోసం వర్మ రూ. 2లక్షలకు పైగా వెచ్చించి 5 టన్నులకు పైగా కాయ గూరలను సమకూర్చారు. కాయగూరలతో కూడిన వాహనాన్ని పిఠాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కష్టాల్లో ఎవ్వరు ఉన్నా ఆదుకోవడంతో తాము ముందుంటామని వర్మ తెలిపారు.