పిఠాపురం: ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పిఠాపురం పట్టణంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ హైస్కూల్ ను మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నిర్వహణపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు ఈ విధంగా ఉంటే మీరు మీ ఇంట్లో ఉపయోగిస్తారా అని సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేస్తున్న ఆహారాన్ని రుచి చూసి వంటకాలు బాగాలేవు అంటూ వారిపై మండిపడ్డారు.