రాజమండ్రి: క్యాన్సర్ నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
క్యాన్సర్ నివారణకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వైద్య సిబ్బందికి. సూచించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. నవంబర్ 14 తారీకు నుండి ప్రజలకు షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర వాటికి సంబంధించి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తునట్లు తెలిపారు.