'ఉపాథి హామీ పథకం' ద్వారా ప్రయోజనం చేకూర్చే విధంగా క్షేత్ర స్థాయిలో విధులను నిర్వర్తించాలని తూ. గో జిల్లా జేసీ ఎస్. చిన్న రాముడు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద హౌసింగ్, ఉపాధి హామీ, ధాన్యం సేకరణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అందుకోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుందన్నారు.