రాజమండ్రి నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర అభివృద్ధిలో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు 'మీ భద్రత మా బాధ్యత' కార్యక్రమం చేపట్టామన్నారు.