సమాజంలో ప్రాధమిక వైద్య సేవలందిస్తున్న పీఎంపీల పాత్ర చాలా కీలకమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం ది పీఎంపీ అసోసియేషన్ తూ. గో జిల్లా ఆధ్వర్యంలో పీఎంపీ 62 వ వ్యవస్థాపక దినోత్సవం రాజమండ్రిలో జరిగింది. జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డా. సూర్యనారాయణ రెడ్డి, తోరాటి ప్రభాకరరావు తదితరులు పాల్గొని పి. ఎం. పి సేవలను ప్రశంసించారు.