రాజానగరం: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రాజానగరం నియోజకవర్గంలో పలువురు అనారోగ్య బాధితులకు రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 11 మందికి రూ. 10. 72 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.