అల్లవరం మండలంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న 8 మంది వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు 8 మంది నిందితులను తహశీల్దార్ ఎదుట శుక్రవారం హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున ష్యూరిటీ విధించారని ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు. బీఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 8 మంది నిందితులను బైండోవర్ చేసినట్లు సీఐ వెల్లడించారు.