గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అల్లవరం ఎంపీడీవో కృష్ణమోహన్ సూచించారు. ఆయన అల్లవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ మొబైల్ క్యాంపుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వారితో చర్చించారు.