అమలాపురం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 198 అర్జీలు స్వీకరణ

73చూసినవారు
అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమానికి 198 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సంబంధిత సమస్య లను అధికారులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్