అమలాపురం మండలంలోని బట్నవిల్లిలో రైతులు ధాన్యం ఆరబోస్తున్న ప్రాంతంలో రెండు తాచుపాములు మంగళవారం హల్చల్ చేశాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ జంపన గణేశ్ వర్మ ఘటనా స్థలానికి చేరుకొని ఇటుకలలో దాగివున్న పాములను బయటకు లాగి వాటిని డబ్బాలో బంధించారు. వాటిని జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాలలో విడిచిపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.