అమలాపురం మండల తహశీల్దార్ గా పలివెల అశోక్ ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తహశీల్దార్ కిషోర్ బాబు పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న అశోక్ ప్రసాద్ ఎఫ్ఎసీ హోదాలో తహశీల్దార్ బాధ్యతలను చేపట్టారు. తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన అశోక్ ప్రసాద్ ను రెవెన్యూ జేఏసీ ఛైర్మన్ విఎస్ దివాకర్, సర్పంచ్ లు నాని, దుర్గారావు అభినందించారు.