సముద్రపు తీర ప్రాంత భద్రతను మరింత మెరుగుపరచే విధంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ లో విశాఖపట్నం కోస్టల్ సెక్టార్ పోలీస్ అడిషనల్ ఎస్పీ మధుసూదనరావు, జిల్లా ఎస్పీ కృష్ణారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, కోస్ట్ గార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సముద్ర తీర ప్రాంత భద్రత రక్షణా చర్యలపై సమీక్షించారు.