అమలాపురం: సీసీ రోడ్డుకు అడ్డుగా ఇనుపరాడ్లు తొలగించాలని ధర్నా

83చూసినవారు
అమలాపురం రూరల్ మండలం బండారులంక పరిధిలోని కందులపాడు కాలనీకి వెళ్లే ప్రధాన మార్గంలో సీసీరోడ్డుకు అడ్డంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వేసిన ఇనుప రాడ్లను తొలగించాలని కలెక్టరేట్ వద్ద సోమవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. 300 కుటుంబాలకు వెళ్లే రహదారిని అడ్డుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కు బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలమూరు మోహన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు వినతిపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్