అమలాపురం: క్రీస్తు సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: కలెక్టర్

54చూసినవారు
ఏసుక్రీస్తు ప్రబోధించిన శాంతి, ప్రేమ, దయ, ఐకమత్యం సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పిలుపు నిచ్చారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని, పొరుగు వారిని ప్రేమతో ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ప్రేమ కరుణ శాంతికి ప్రతిరూపం క్రిస్మస్ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్