ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. మంగళవారం జిల్లాలోని అధికారులకు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నిర్వహణపై శిక్షణ తరగతులను నిర్వహించి, భూ యజమానుల ఓటర్ల జాబితా తయారీపై అవగాహన కల్పించారు.