ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వికలాంగులైన లబ్ధిదారులకు మంజూరు అయ్యే పెన్షన్ల తనిఖీ ప్రక్రియను నూటికి నూరు శాతం ముమ్మరంగా అధికారులు చేపట్టాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. పెన్షన్లు వెరిఫికేషన్ పై అధికారులకు ఆయన సూచనలు చేశారు.