2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సోమవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికారులకు సూచనలు చేశారు. ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మహేశ్ కుమార్, జిల్లా అధికారులు హాజరయ్యారు.