1999లో చేసినట్లుగా రాష్ట్రం యూనిట్ గా తీసుకుని ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ మోకాటి నాగేశ్వర రావు సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. అమలాపురం పరిధిలోని నడిపూడి బాబు జగజ్జీవన్ రామ్ కళ్యాణ్ మండపంలో సోమవారం జరిగిన కోనసీమ ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా యూనిట్ గా వర్గీకరణ చేయడం వల్ల కోనసీమలో మాదిగ ఉప కులాలు నష్టపోతారన్నారు.