పరిశుభ్రమైన వాతావరణమే లక్ష్యం: ఎంపీడీవో

76చూసినవారు
కలెక్టర్ ఆదేశాలు మేరకు అల్లవరం మండలంలోని అన్ని గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణమే లక్ష్యంగా ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టనున్న స్వచ్ఛతా హి సేవా కార్య క్రమాలను నిర్వహించాలని ఎంపీడీవో కృష్ణమోహన్ సూచించారు. అల్లవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల నిర్వహణకు శనివారం నుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్