రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ రాహుల్ గాంధీకి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.