అమలాపురం మండలంలోని పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా శనివారం సందర్శించారు. క్షేత్ర స్థాయిలో ఆధార్ అప్డేట్ చేయుటకు పేరూరు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆధార్ క్యాంప్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అందరు విద్యార్థులు అపార్ ఐడి జెనరేట్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు.