విజయవాడ వరద బాధితుల కోసం సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు మంగళవారం 20 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు డ్రాఫ్ట్ అందించారు. 'గోదావరి సాయం' పేరిట, సురుచి ఫుడ్స్ 7 బ్రాంచీల ఆదివారం అమ్మకం మొత్తాన్ని మరియు సిబ్బందిలోని వేతనాన్ని సాయం నిధికి అందించింది.