చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహణపై జిల్లాలోని ఎంపీడీవోలు, ఇతర అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ముమ్మరంగా చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.