నిర్దేశిత ప్రదేశాలలోనే నిమజ్జనాలు చేయాలి: కలెక్టర్

62చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వినాయక నిమజ్జనాలను అధికారులు నిర్దేశించిన ప్రదేశాలలోనే నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలన్నారు. అలాగే మరో రెండో రోజులు వర్షాలున్న నేపథ్యంలో గ్రామాలలో ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్