కోనసీమలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి అయింది. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కలెక్టరేట్లో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమై, మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. జిల్లాలో మొత్తం 133 షాపులకు 3, 996 దరఖాస్తులు వచ్చాయి. ఈ లాటరీలో 133 దరఖాస్తులకు షాపులు దక్కాయి. 3,863 దరఖాస్తులు తిరస్కరించారు.