పి. గన్నవరం: ఇసుక దందాను అరికట్టాలని కలెక్టర్కు వినతి

61చూసినవారు
పి. గన్నవరం: ఇసుక దందాను అరికట్టాలని కలెక్టర్కు వినతి
పి. గన్నవరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దందాను అరికట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు శనివారం కలెక్టర్ను కోరారు. పి. గన్నవరం నియోజకవర్గంలోని పది ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక దందా కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకొని పేద ప్రజలకు ఉచితంగా ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్