వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రాథమిక రంగ సెక్టార్ గా ఉన్న వ్యవసాయం, వాటి అనుబంధ స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకై రుణాల కల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ మహేష్ కుమార్ బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు.