కోనసీమ ప్రజలకు రైలు కూతను వినిపిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కంకిపాడులో సోమవారం నిర్వహించిన పల్లె వారోత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. కోనసీమ ప్రజల చిరకాల స్వప్నం అయిన రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. కోనసీమ రైల్వే లైన్ను మచిలీపట్నం మీదుగా కలవాల్సి ఉందని ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తామని తెలిపారు.