పెదపూడి మండలం దోమడ గ్రామంలో మంగళవారం సచివాలయం సెక్రటరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ జల్ ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామశాఖ అధ్యక్షులు కాకర్ల గోవింద్ మాట్లాడుతూ ప్రకృతి వనరులను సంరక్షించుకోవాలని, నీటిని వృధా చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మద్దిపూడి దొరబ్బాయి, గుణ్ణం వెంకటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్ పాలచర్ల వెంకట్రావు, మండల అధికారులు, కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.