అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో శనివారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనపర్తి వైసిపి కార్యాలయం తో పాటు పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకులను మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. రామవరం లో ఏఎంసీ మాజీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి జగన్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు.