అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు పంచాయతీ కార్యాలయంలో విద్యుత్ బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పెండ్యాల సూర్య మోహన్ (27) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లిలో తన ఇంటి నుంచి కార్యాలయానికి మోటార్ సైకిల్ పై బయలుదేరిన మోహన్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతణ్ని బంధువులు అమలాపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.