ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని, ప్రకృతే ప్రతిఒక్కరికీ జీవనాధారమని ఇన్ చార్జ్ ఛైర్‌పర్సన్ శ్రీనివాసరావు, సిఈఓ శ్రీనివాసరావ్ అన్నారు. గోపాలపురం వ్యవసాయ సహకార సంఘం వద్ద శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడూతూ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు చెట్లు ఎంతో దోహాదపడతాయన్నారు.